జిమ్‌కు కాదు ఆస్పత్రికి వెళ్లండి..వెంటనే సిక్స్‌ ప్యాక్‌..!

274
thailand sixpack

సిక్స్ ప్యాక్ …..నేటి యువతకు ఎంతో క్రేజ్. అందుకోసం ఎంతో శ్రమపడాలి. బానపొట్టను కరిగించేయాలి. పొట్టకు మాత్రమే వ్యాయామమంటే చాలదు. వ్యాయామానికి తగ్గ ఆరోగ్యవంతమైన ఆహారాన్ని కూడా తీసుకోవాలి. కానీ ఇప్పుడు అలాంటి కష్టం లేకుండా ఈజీగా సిక్స్‌ ప్యాక్‌ పొందవచ్చు.

మారుతున్న కాలం, పెరుగుతున్న టెక్నాలజీతో ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేశారు డాక్టర్లు. దీంతో అన్ని ఇన్‌స్టంట్‌గా పొందడం ఈజీ అయిపోయింది. ఇప్పటి వరకు మనం ముఖం, ముక్కు, పెదాలు ఇలా చాలా భాగాలకు ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకున్న వారిని చూశాం కానీ ఇప్పుడు ఏకంగా కష్టపడకుండానే సిక్స్‌ప్యాక్‌ షేప్‌ను అందిస్తామని ఓ ఆస్పత్రి ఆఫర్‌ చేస్తోంది.

thailand sixpack

థాయ్‌లాండ్‌లో ఉన్న మాస్టర్‌ పీస్‌ ఆస్పత్రి ఇప్పుడు ఫేమస్‌గా మారింది. అబ్‌డామినల్‌ ఎట్చింగ్‌ పేరుతో నిర్వహించే ఈ ఆపరేషన్‌ ద్వారా ఎవరికైనా సరే సిక్స్‌ప్యాక్‌ బాడీ వచ్చేలా చేస్తారట. అందరిలోనూ సిక్స్‌ప్యాక్‌ ఉంటుంది గానీ కొవ్వు దాన్ని కప్పేస్తుందట. ఆపరేషన్‌ ద్వారా వైద్యులు ఉదర భాగంలోని కొన్ని చోట్ల ఆ కొవ్వును తొలగించి కావాల్సిన చోట చేర్చి సిక్స్‌ప్యాక్‌ను బయటకు తీసుకువస్తారు. అయితే ఉదర భాగంలో కండరాలు బలంగా ఉన్నవారికే ఈ ఆపరేషన్‌ విజయవంతమవుతుందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో ప్లాస్టిక్‌, సిలికాన్‌ వంటివి వాడమని, అందుకే ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్యులు చెబుతున్నారు.

గత 3 ఏళ్లుగా తమకు మంచి ఆదరణ వస్తుందని నెలకు కనీసం 20 నుంచి 30 మంది యువకులు సిక్స్‌ప్యాక్‌ బాడీ కోసం ఈ ఆపరేషన్‌ యించుకుంటున్నారని మాస్టర్‌పీస్‌ ఆస్పత్రి సీఈవో తెలిపారు. సో మొత్తంగా ఇకపై కండలు కరిగించకుండానే సిక్స్‌ ప్యాక్ బాడిని పొందవచ్చు.