ఎస్ఐకి ముద్దుపెట్టిన యువకుడు అరెస్ట్

649
Youth-kissed-Nallakunta-si
- Advertisement -

బోనాల పండుగ సందర్భంగా డ్యూటీలో ఉన్న ఎస్సై పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. బోనాల ఊరేగింపు బందోబస్తులో ఉన్న ఎస్సై మహేందర్ పక్క నుంచి వెళ్లడాన్ని గమనించిన ఓ యువకుడు ఆయన్ని గట్టిగా పట్టుకుని ముద్దుపెట్టాడు. ఈ హఠాత్ పరిణామంతో షాక్ తిన్న ఎస్సై మహేందర్ యువకుడి చెంప చెళ్లుమనిపించాడు.

ఎస్సైకి ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారడంతో ఈవిషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. ఎస్ఐ మహేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సోమాజిగూడలో బ్యాంకులో పనిచేస్తున్న మల్కాజ్‌గిరికి చెందిన బాను ఆదివారం రాత్రి నల్లకుంటలోని స్నేహితులతో కలిసి మద్యం తాగి డ్యాన్స్‌ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య ప్రవర్తన దృశ్యాలు వైరల్‌గా మారాయి. యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -