దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు!

232
tsrtc
- Advertisement -

పండుగ రద్దీ కారణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒక్కో ప్రాంతానికి ఒక్కో పాయింట్ నుంచి బస్సులను ఏర్పాటు చేశారు. సొంతూళ్లకు బయలు దేరే ప్రయాణికులతో బస్టాండ్ లు,రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.

దసరా పండగ నేపథ్యంలో హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు 3000 బస్సులను నడుపుతోందని రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. 24 వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయని వెల్లడించారు. ఈ నెల 22 నుండి 24 మధ్య 2034 బస్సులు నడుస్తాయని పండుగ రద్దీ దృష్ట్యా అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ కల్పించామని చెప్పారు.

ఈ ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుండి ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు నడవనున్నాయని పేర్కొన్నారు. ఎంజీబీఎస్ ,జేబీఎస్, కూకట్ పల్లి ,దిల్ సుఖ్ నగర్ , ఎస్సార్ నగర్, అమీర్పేట్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీనగర్ పలు ప్రాంతాల నుండి ఈ ప్రత్యేక బస్సులు ఉన్నాయని పేర్కొన్నారు.

- Advertisement -