వైల్డ్ కార్డ్ ఎంట్రీనే మైనస్ అయింది: కుమార్ సాయి

108
kumar sai

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఆరోవారం ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యారు కుమార్ సాయి. అయితే ఇంటి నుండి బయటకు వెళ్తుంటే ఎమోషన్‌తో కంటతడి పెట్టేవారిని ఇప్పటివరకు చూశాం కానీ ఇందుకు భిన్నంగా నవ్వుతూ బయటకు వచ్చి మరింత ఇంప్రెస్ చేశారు కుమార్ సాయి.

ఇక బిగ్ బజ్‌లో భాగంగా రాహుల్‌ సిప్లిగంజ్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు కుమార్ సాయి. ఎలిమినేట్ అయినందుకు బాధ లేదు కానీ బయటకు వచ్చాకే బాధ అనిపిస్తుందన్నారు. తనని హౌస్‌లో కన్ఫ్యూజ్ మాస్టర్‌గా చిత్రీకరించారు కానీ నన్ను అర్దం చేసుకోవడంలో వాళ్లే కన్ఫ్యూజ్ అయ్యారని తెలిపారు. హౌస్‌లో అఖిల్‌ని చూసి అంతా నవ్వుకుంటున్నారని అందుకే అఖిల్‌ని కరివేపాకుతో పోల్చానని తెలిపాడు.

హౌస్‌లోకి వెళ్లినప్పుడు కంఫర్ట్‌గా అనిపించలేదు కానీ తరువాత తనకు ఏం అర్థమైందంటే మిగితా సభ్యులు ఎంత కంఫర్ట్ జోన్‌లో ఉన్నాసరే సింగిల్‌గానే ఆడుతున్నారు. పైకి మాత్రం నటిస్తూ ఉన్నారని తెలిసిందన్నారు. వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్లడం తనకు మైనస్ అయ్యింది. నేను వెళ్లేసరికి హౌస్‌లో వాళ్ల వాళ్ల ఫ్రెండ్స్‌తో సెట్ అయిపోయారు. నన్ను కలుపుకోలేదు. మనుషులు అయితే చేయరు.. కొన్ని జంతువులు అలా చేస్తాయి అన్నారు.

డాన్స్ చేయాలి.. యాక్ట్ చేయాలి.. అంటే టాస్క్ వరకూ చేస్తా.. కానీ హౌస్‌లో మొత్తం నటిస్తూనే ఉండాలని చెప్పేవారు….. నా వ్యక్తిత్వానికి కప్పురావాలని వెళ్లా, నా పెర్ఫామెన్స్‌కి కప్పురావాలని బిగ్ బాస్‌కి వెళ్లలేదన్నారు. త్వరలోనే నాగార్జున సార్‌కి కథ వినిపిస్తానని సంతోషంగా చెప్పారు కుమార్ సాయి.