సజ్జనార్ నేతృత్వంలో టీఎస్ఆర్టీసీ ప్రజలకు మరింత చేరువవుతోంది. ఇప్పటికే పలు నిర్ణయాలతో అందరి మన్ననలు పొందుతున్న టీఎస్ఆర్టీసీ తాజాగా మరో ముందడుగు వేసింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించనుంది.
ఒకరి రక్తదానం-ముగ్గురికి ప్రాణదానం అనే పేరుతో అన్ని డిపోల్లోని 101 వేర్వేరు ప్రాంతాల్లో ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్పెషల్ బ్లడ్ డొనేషన్ క్యాంపులు అందుబాటులో ఉంచనుంది.
Also Read:” గుంటూరు కారం ” కాపీ కథనా ?
ప్రజలు, విద్యార్థులు ఎత్తున తరలివచ్చి రక్తదానం చేయాలని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ తెలిపారు. అన్ని దానాలలో రక్తదానం చాలా గొప్పదని, రక్తం అనేది కృత్రిమంగా ఉత్పత్తి చేయబడదని తెలిపారు. రక్తదానం చేయడం అంటే మరొకరికి ప్రాణదానం చేయడమేనని, అందరూ ముందుకొచ్చి రక్తదానం చేయాలని సూచించారు.
Also Read:వెల్లుల్లి రసంతో ఎన్ని ఉపయోగాలో.. !