టెలీపర్ఫామెన్స్‌..3వేల ఉద్యోగాలు

9
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వ కృషి, మంత్రి కేటీఆర్ చొరవతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రానికి క్యూ కట్టగా తాజాగా మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది.ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ డిజిటల్‌ బిజినెస్‌ సేవల సంస్థ టెలీపర్ఫామెన్స్‌ రాష్ట్రంలో క్యాంపస్‌ను ప్రారంభించనుంది.

ఈ మేరకు సంస్థ ప్రతినిధులు ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ను కలిసి పెట్టుబడులపై వివరించారు. 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. వచ్చే నెలలో క్యాంపస్‌ను ప్రారంభించాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు.

టెలీపర్ఫామెన్స్‌ సంస్థ 45 ఏండ్ల కిందట పారిస్‌ కేంద్రంగా 1978లో ప్రారంభమైంది. కంపెనీని డానియెల్‌ జులియెన్‌ స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సంస్థకు శాఖలున్నాయి.

Also Read:” గుంటూరు కారం ” కాపీ కథనా ?

- Advertisement -