ఆర్టీసీ కార్గో సర్వీసెస్‌…హోమ్ డెలివరీ

211
tsrtc
- Advertisement -

ప్రయాణీకులకు మరింత చేరువయ్యేందుకు ఆర్టీసీ సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే కార్గో సేవలతో ప్రజల మన్ననలు పొందుతున్న ఆర్టీసీ తాజాగా మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

ఇవాళ్టి నుంచి ప్రయోగాత్మకంగా ఇంటికే పార్శిళ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో టీఎస్ఆర్టీసీ పార్శిల్ – హోమ్ డెలివరీ సేవలు ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొలుత ప్రారంభించగా 3 నెలల పాటు ప్రయోగాత్మకంగా సేవలు అందించనున్నారు. విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. నగరాన్ని మూడు సెక్టార్లుగా విభజించి పలు సంస్థలకు ఈ బాధ్యతను అప్పజెప్పింది ఆర్టీసీ. డెర్‌ డెలివరీ సేవలతో రోజుకు రూ.13లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

- Advertisement -