తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు…

171
gold
- Advertisement -

రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గి రూ.50,500కు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.46,300కు చేరింది.

బంగారం బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండిపై ఏకంగా రూ. 1500 తగ్గి వెండి ధర రూ.68,000గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.07 శాతం పెరుగుదలతో 1839 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.10 శాతం పెరుగుదలతో 24.01 డాలర్లకు చేరింది.

- Advertisement -