మొక్కలు నాటిన టీఎస్‌పీఎస్సీ సుమిత్రానంద్..

12
gic

తన జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు TSPSC సభ్యురాలు సుమిత్రానంద్. రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకులు హరితబంధు పర్యావరణవేత్త జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తన పుట్టిన రోజు సందర్భంగా మునగ ,నిమ్మ ,దానిమ్మ మొక్కలను వారి వ్యవసాయ క్షేత్రం లో నాటారు.

గాలిపీల్చుకోవడం మరువనట్టే తమకు ప్రాణవాయువును అందించే మొక్కలను నాటి సంరక్షించి పెంచడం మరవొద్దు అని సుమిత్రానంద్ అన్నారు. గౌరవ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన మొక్కలు నాటే మహయజ్ఞం గ్రీన్ ఇండియా చాలేంజ్ సామాన్యులనుండి సెలబ్రెటీల వరకు అందరిని కదిలిస్తున్నదని సుమిత్రానంద్ అన్నారు ….

హరిత స్పూర్తిని నింపుతున్న ఎంపీకి ధన్యవాదాలు తెలియజేశారు. తాను అనేక సందర్భాల్లో ఈ స్పూర్తి తో మొక్కలు నాటి సంరక్షిస్తున్నందుకు సంతోషంగా ఉందని సుమిత్రానంద్ తెలిపారు …కార్యక్రమం లో జిల్లా TRSMA అధ్యక్షులు ఆమె భర్త ఆనంద్ రావు కుమార్తె మహతి పాల్గొన్నారు..