టీఎస్‌పీఎస్సీ..ఆమూడు పరీక్షల తేదీలు ప్రకటన

14
- Advertisement -

టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలను వెల్లడించింది. ఈ నెల 15,16తేదీల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌ పోస్టులకు, ఏప్రిల్ 4న హార్టికల్చర్‌ ఆఫీసర్ పోస్టులకు ఏప్రిల్ 23న సహాయ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.

రవాణాశాఖలో 113సహాయ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు, హార్టికల్చర్ ఆఫీసర్ 22పోస్టులకు, పశుసంవర్థక శాఖలో 185వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్(క్లాస్ఏ,బీ)పోస్టులకు గాను గతంలో వేర్వేరుగా నోటిఫికేషన్‌లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్టు తెలిపింది. అయితే దీనికి హాల్ టికెట్ డౌన్‌లౌడ్ తేదీలను మాత్రం ప్రకటించలేదు. పూర్తి వివరాలకు టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని సూచించింది.

ఇవి కూడా చదవండి…

రెరా ఛైర్మన్‌గా శాంతికుమారి..

ఉమెన్స్ డే..గ్రీన్ పోస్టర్ ఆవిష్కరించిన డీసీపీ శిల్పవళ్లి

ఉమెన్స్ డే..గ్రీన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన శ్వేతా

- Advertisement -