తుది పోటికి సిద్ధమవ్వండి:టీఎస్‌ఎల్‌ఆర్బీ

75
- Advertisement -

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతున్న వేళ…టీఎస్‌ఎల్‌ఆర్బీ కీలక నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగాల నియామక ప్రక్రియకు సంబంధించి తుది పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. సివిల్ ఎస్ఐ, కానిస్టేబుల్, ఇంటెలిజెన్స్ ఎస్ఐతోపాటు ఎక్సైజ్, రవాణా తదితర విభాగాల ఉద్యోగాల తుది పరీక్షల్ని మార్చి 12 నుంచి నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా 17,560 పోస్టులను భర్తీచేసేందుకుగాను ప్రాథమిక పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. గత నెల 8నుంచి ఫిజికల్ టెస్ట్‌లు కూడా నిర్వహిస్తున్నారు. ఫిజికల్‌ టెస్ట్‌ల్లో అర్హత సాధించిన వారికి త్వరలో హాల్‌ టిక్కెట్లు జారీ చేయనున్నట్టు ప్రకటించారు. దాంతో పాటుగా డ్రైవర్‌ పోస్టులకు అర్హులైన వారిని డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది. కాగా తుది పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది. మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 23వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.

పరీక్షల షెడ్యూల్‌

  • మార్చి 23న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో ఉదయం ఎస్ఐ అభ్యర్థులకు,
  • మధ్యాహ్నం ఫింగర్ ప్రింట్స్ విభాగంలో ఏఎస్ఐ పోస్టులు
  • మార్చి 26న పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్‌లో ఎస్సై పోస్టులు
  • ఏప్రిల్ 2న ఉదయం డ్రైవర్లు, డ్రైవర్ ఆపరేటర్స్ (కానిస్టేబుల్స్), మధ్యాహ్నం మెకానికల్ (కానిస్టేబుల్) పోస్టులు
  • ఏప్రిల్ 8న సివిల్, ఐటీ, ఫింగర్ ప్రింట్స్ విభాగాల్లోని పోస్టులు
  • ఏప్రిల్ 9న సివిల్, ఇతర విభాగాల ఎస్ఐ పోస్టులు
  • ఏప్రిల్ 23న సివిల్, ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్ విభాగాం

ఇవి కూడా చదవండి…

గ్రూప్‌-2 సిలబస్‌లో స్వల్ఫ మార్పులు

తెలంగాణ స్పోర్ట్స్‌ చైర్మన్‌గా డా.ఆంజనేయ గౌడ్

నోట్ల రద్దు సమర్థనియమే:సుప్రీం

- Advertisement -