సోష‌ల్ మీడియాలో వ‌చ్చే వదంతులు న‌మ్మ‌వ‌ద్దు

238
cmd Prabhakar Rao
- Advertisement -

జనతాకర్ఫ్యూ,రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ వల్ల కరెంట్ కోతలు అంటూ సోషల్ మీడియా లో వస్తున్న వదంతులు నమ్మ‌వద్దు అన్నారు టీఎస్ జెన్కో, ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు. విద్యుత్ ఉత్పత్తి కి ఎక్కడ ఆటంకాలు లేవని.. అన్ని ప్లాంట్ లలో 24 గంటలు విద్యుత్ ఉత్ప‌త్తి జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామ‌ని వెల్ల‌డించారు.

క‌రెంట్ విష‌యంలో ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్ద‌ని…ఇంత‌కుముందు ఎలాగు క‌రెంట్ ఉండేదో ఇప్పుడు కూడా అలా స‌రాఫ‌రా అవుతుంద‌ని తెలిపారు. క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరారు. అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప మిగ‌తా స‌మ‌యంలో ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని తెలిపారు. ఇంట్లోనే ఉండి త‌మ ఆరోగ్యాన్ని సుర‌క్షితంగా ఉంచుకోవాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌భుత్వానికి, పోలీసుల‌కు ప్ర‌జ‌లు స‌హాక‌రించాల‌ని తెలిపారు.

- Advertisement -