గ్రేటర్ హైదరాబాద్ నగరంలో భారీ వర్షం నేపథ్యంలో సీజీఎం, సూపెరింటెండింగ్ ఇంజినీర్లతో విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ జి రఘుమా రెడ్డి. డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు, సెంట్రల్ బ్రేక్ డౌన్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం నీరు నిల్వ వున్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థకు తెలియజేయలని సీఎండీ జి రఘుమా రెడ్డి తెలిపారు.
ఈ రోజు రాత్రి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున, క్షేత్ర స్థాయి అధికారులంతా అందుబాటులో ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. విద్యుత్ వోల్టేజ్ లో హెచ్చు తగ్గులు వున్నా, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగలరు సీఎండీ జి రఘుమా రెడ్డి తెలిపారు.