మెడికల్ పీజీ విద్యార్థులను ప్రమోట్ చేయాలి- ఈటెల

241
Minister Etela

కరోనా వల్ల ఏర్పడిన ప్రత్యేక పరిస్థులను దృష్టిలో పెట్టుకొని అతితక్కువ మార్కులతో ఉత్తీర్ణత సాధించలేక పోయిన మెడికల్ పీజీ విద్యార్థులను ప్రమోట్ చేయాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ ను కోరారు. ఈ రోజు సాయంత్రం మంత్రి ఈటెల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో ఫోన్‌లో మాట్లాడి పీజీ విద్యార్థుల పరిస్థితిని వివరించారు.

కరోనా కాలంలో రెగ్యులర్ అకాడమిక్ క్లాస్ లకు హజరుకాలేక పోవడంతో పాటు, కరోనా రోగులకు చికిత్స అందించే బృహత్తర కార్యక్రమంలో వారంతా నిమజ్ఞయ్యారు అని తెలిపారు. ఈ పరిస్థితిని ప్రత్యేక సందర్భంగా గుర్తించాలని మంత్రి ఈటెల కోరారు.