దర్శకుడు సింగీతం శ్రీనివాస‌రావు క‌రోనా..

215
Singeetam Srinivasa Rao

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విళయతాడవం చేస్తోంది. ఎంతమంది ప్రముఖులు దీని బారిన పడ్డారు. తాజాగా ప్రముఖ సినీ దర్శకులు సింగీతం శ్రీనివాస‌రావు క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌న బుధ‌వారం సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కరోనా ల‌క్ష‌ణాలు కనిపించడంతో సెప్టెంబ‌ర్ 9న చెన్నైలో ప‌రీక్ష చేయించుకోగా పాజిటివ్ వ‌చ్చింద‌ని ,ప్ర‌స్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”నేను ఇప్పుడేంటి.. గ‌త అర‌వై, డ‌భై ఏళ్లుగా పాజిటీవ్‌నే…` అంటూ.. చమత్కరించారు దర్శకుడు. పరీక్షల్లో పాజిటీవ్ అని తేలడంతో ఆయన ప్రస్తుతం హోం ఐసొలేష‌న్‌లో ఉన్నాన‌ని పేర్కోన్నాడు. ఈ హోమ్ ఐసోలేషన్ ఈనెల 23 వ‌ర‌కూ ఉండనుందని చెప్పారు. ఈ సందర్భంగా తన అభిమానులు, స‌న్నిహితులు, స్నేహితులు కంగారు ప‌డొద్ద‌ంటూ.. త‌న ఆరోగ్యం పూర్తిగా అదుపులోనే ఉంద‌ని, త్వ‌ర‌లోనే పూర్తిగా కోలుకుంటానని అన్నారు.