కేంద్ర ఐటీ శాఖ మంత్రికి కేటీఆర్‌ లేఖ..

161
ktr it
- Advertisement -

మొన్న అన్ని రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఐటి, మరియు అనుభంద పరిశ్రమను ఆదుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలకు సంబంధించి సవివరమైన లేఖ రాస్తానని మంత్రి కే.తారకరామారావు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు భారత ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ కి మంత్రి కే. తారకరామారావు ఈరోజు ఒక లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న సంక్షోభంలో కేంద్ర ప్రభుత్వంతో పరిశ్రమ పరిస్థితులపైన జరుగుతున్న సంభాషణలో తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వాములు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్, ఐటీ, ఐటిలోని ఎం ఎస్ ఎంఈలను ఆదుకునేందుకు చేయాల్సిన మరిన్ని కార్యక్రమాలకు సంబంధించి ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. మంత్రి కేటీఆర్ రాసిన లేఖలోని ప్రధానాంశాలు:

ఐటి రంగంలోని సూక్ష్మ మరియు మధ్య స్థాయి పరిశ్రమలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన ఉన్నదని, ఇందుకు సంబంధించి పలు సూచనలు మంత్రి కేటీఆర్ ఈ లేఖలో చేశారు హైదరాబాద్ నగరంలో సుమారు ఆరు లక్షల మంది ఐటి ఉద్యోగులు ఉన్నారని, ప్రస్తుత సంక్షోభ ప్రభావం వారిపై ప్రత్యక్షంగానో, పరోక్షంగా ఉన్నదని తెలిపారు. అయితే ఈ ప్రభావం చిన్న కంపెనీలపైన అధికంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా కంపెనీలకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఐటి మరియు జీఎస్టీ పన్నుల రిఫండ్లను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలన్నారు. 25 లక్షల కన్నా తక్కువగా ఉన్న ఆదాయపు పన్ను బకాయిలను వెంటనే విడుదల చేయాలని సూచించారు. 25 లక్షలకు పైగా బకాయిలు ఉన్న నేపథ్యంలో వాటిలో కనీసం 50 శాతం అయిన వెంటనే విడుదల చేయాలని కోరారు. జిఎస్టికి సంబంధించి కేంద్రం ప్రకటించిన మినహాయింపుల విషయంలో తొలినాళ్లలో కొంత అయోమయం నెలకొన్న నెలకొన్న నేపథ్యంలో అనేక కంపనీలు పూర్తిస్థాయిలో పన్నులు చెల్లించాలని, అయితే ఆయా సంస్థలకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రావలసిన రీపండ్లను వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి కంపెనీలకు సహాయకారిగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వ ఐటి విభాగంలో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వివిధ శాఖలతో సమన్వయానికి అవకాశం కల్పించాలని కోరారు.

సూక్ష్మ మధ్య మధ్యతరహా సంస్థలకు కనీసం 50 శాతం రుణ సదుపాయాన్ని పెంచాలని, తద్వారా మూడు నుంచి నాలుగు నెలల పాటు ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు వీలు కలుగుతుందని, దీంతో కరోనా సంక్షోభం వలన లే అప్స్ (lay offs) కలుగకుండా ఉంటాయని మంత్రి తెలియజేశారు. దీనిపైన సుమారు మూడు నుంచి నాలుగు నెలల పాటు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాలు ఉండాలని కోరారు. ఇలాంటి రుణాలను తిరిగి వసూలు చేసేందుకు కనీసం 12 నెలల కాలాన్ని నిర్దేశించాలన్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లకు సంబంధించిన ప్రత్యక్ష ప్రయోజనాలను పొందుటకు మార్చి31, 2020 తుది గడువుగా కేంద్రం ప్రకటించిందని, దీనిని కనీసం వచ్చే ఏడాది వరకు పొడగించాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం అనేక కంపెనీల్లోని ఉద్యోగుల సాంద్రత ఆఫీస్ కార్యాలయ స్థలంతో పోలిస్తే ఎక్కువగా ఉందని, దీన్ని ఒక్కో ఉద్యోగికి 100 నుంచి 125 చదరపు అడుగులులా నిర్దేశించాలన్నారు. అన్ని ఐటి పార్కులు, సెజ్ ల్లోని కార్యాలయాలకు ఈమేరకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయాల్సిన అవసరం ఉందని, తద్వారా సురక్షిత కార్యక్షేత్రాలు( work places) ఉండే అవకాశం ఉందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. దీంతోపాటు ఐటీ పార్కులు, సెజ్ ల్లోని కార్యాలయాలకు, ప్రత్యేకమైన ఆరోగ్య మార్గదర్శకాలతో కూడిన స్టాండర్డ్ హెల్త్ కోడ్ ని ప్రవేశపెట్టాలని, అగ్నిమాపక మార్గదర్శకాల మాదిరే వీటిని కూడా తప్పనిసరి చేయాలని తన లేఖలో సూచించారు.

- Advertisement -