పూరితో “ఆగ్రహం” మోషన్ పోస్టర్..

172

ఎస్.ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకంపై సుదీప్, సుస్మిత ,సందీప్, రాజ్ సింగ్ హీరో హీరోయిన్లు గా ఆర్.ఎస్ సురేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “ఆగ్రహం”. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ని నేడు పూరీ జగన్నాధ్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు సురేష్, నిర్మాత సందీప్ చెరుకూరి, ఎగజిక్యూటివ్ ప్రొడ్యూసర్ మూర్తి ఆడారి తదితరులు పాల్గొన్నారు.

Aagraham Telugu Movie

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సురేష్ మాట్లాడుతూ..”ఇదో విభిన్న కధా చిత్రం. సంగీతానికి ప్రాధాన్యత ఉన్న చిత్రమిది. పూరి జగన్నాధ్ మా సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేసినందుకు, ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను. అలాగే సినిమాను మే ఎన్డింగ్‌లో రిలీజ్ చేయలనుకుంటున్నాం. ఆని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.కె. సంగీతం: ఆర్.ఆర్.రవిశంకర్, ఎడిటర్:జె. పి,ఎగజిక్యూటివ్ ప్రొడ్యూసర్: మూర్తి ఆడారి, నిర్మాత: సందీప్ చెరుకూరి, దర్శకత్వం: ఆర్.ఎస్ సురేష్.

Aagraham Telugu Movie Motion Poster |Sudeep,Sandeep |Raj Singh | Sushmitha | SS Cherukuri Crteations