నందమూరి హరికృష్ణ అకాల మరణం సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు దిగ్భ్రాంతిని కలగజేసింది. కాగా హరికృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా నిర్వహించిన కేసీఆర్, ఇప్పుడు హరికృష్ణ స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
హరికృష్ణ అంత్యక్రియలు జరిగిన మహా ప్రస్థానం లోనే ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. అందుకుగాను 450 గజాల స్థలాన్ని కేటాయించింది కేసీఆర్ ప్రభుత్వం. కేసీఆర్ కు మొదటి నుంచి నందమూరి కుటుంబం అంటే మక్కువ ఎక్కువ. ఆయనకు రాజకీయ జన్మను ప్రసాదించిన నందమూరి తారకరామారావుగారిని దేవుడిగా భావించే కేసీఆర్ ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరిపించి ఆయన గురుభక్తిని చాటుకున్నారు. ఒక్కమగాడు అంటే అది ఎన్.టి.ఆర్ మాత్రమే నని ఆయన పలుమార్లు వ్యహాఖ్యానించారు. హరికృష్ణ అంత్యక్రియలను పూర్తి చేసిన తర్వాత ఆయన కుటుంబంతో మాట్లాడి స్మారక చిహ్నం ఏర్పాట్లు మొదలు పెడతామని వెల్లడించారు కేసీఆర్.