ఫన్నో .. ఫ్రస్టేషనో .. అర్ధం కావట్లేదే..!

366
Tamannaah Bhatia, Mehreen Pirzada to share screen for F2
- Advertisement -

తమన్నా , మెహ్రీన్ ఇద్దరు కలిసి జనాన్ని భయపెట్టాలని చూస్తున్నారు. అది మరి ఫన్ కోసమో, ఫ్రస్టేషన్ తీర్చుకోవడానికో అర్ధం కావట్లేదు.. అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చిలిపిగా కామెంట్లు పెడుతున్నారు.

Tamannaah Bhatia, Mehreen Pirzada to share screen for F2

 

 

వీళ్ళిద్దరూ F2 సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనే కాప్షన్ తో వస్తున్న ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. వెంకీ కి జంటగా తమన్నా , వరుణ్ తేజ్ కి జంటగా మెహ్రీన్ నటిస్తుండగా, ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో భాగంగా కలిసిన తమన్నా, మెహ్రీన్ సరదాగా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసారు. వాళ్ళు దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tamannaah Bhatia, Mehreen Pirzada to share screen for F2

వాళ్ళ ఫోటోలలో విచిత్రమైన ముఖ కవళికలతో ఉన్న ఓ ఫోటో ను చూసి జనాన్ని భయపెట్టకండి అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు, ఇంకొందరు ఇద్దరు మిల్క్ బ్యూటీస్ ఒక చోట చేరారు. చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదు అంటూ కితాబులిస్తున్నారు. సంప్రదాయబద్ధంగా వస్త్రధారణ చేసుకున్న తమన్నా, మెహ్రీన్ ఇలా సరదాగా ఫోటోలు దిగడం ఎంతో చూడముచ్చటగా ఉందని వారి అభిమానులు పొంగిపోతున్నారు.

- Advertisement -