హరికృష్ణ కోరికమేరకు మంచు మనోజ్..!

179

సెప్టెంబర్ -02 హరికృష్ణ పుట్టిన రోజు. ఆయన పుట్టిన రోజంటే నందమూరి అభిమానులు ఊరూరా ఫ్లెక్సీలతో , కటౌట్లతో ర్యాలీలతో హంగామా చేయడం సహజమే .కానీ హరికృష్ణ గారు ఈ సారి తన పుట్టినరోజుకు ఎటువంటి ఆర్భాటాలు చేయొద్దని..ఆ డబ్బును నష్టపోయిన కేరళ బాధితులకు సహాయంగా పంపండి అని లేఖ రాసారు. ఆ లేఖ అభిమానులకు చేరిందో లేదో. ఆయన ఇక లేరనే ఘోరమైన వార్త వాళ్ళని కలచి వేసింది. ఆయన లేకపోయినా ఆయన కోరికను తీర్చడానికి నేను సిద్ధం అంటున్నాడు మంచు మనోజ్.

manchu manoj tweets about harikrishna's wish.

ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపిన మనోజ్. ‘‘ఆయన కోసం.. మనం ముందుకొద్దాం. ఆయన గుర్తుగా నేను 5 లక్షలు కేరళ బాధితులకు సహాయం చేస్తున్నాను. ఇలాగే నందమూరి అభిమానులంతా. లక్షలాది మంది కేరళ ప్రజల సహాయార్థం ముందుకొచ్చి, హరికృష్ణ కోరిక తీరుస్తారని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నాడు. అది చూసినా నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ మనోజ్ కు హరికృష్ణ మీద ఉన్న అభిమానాన్ని మెచ్చుకుంటున్నారు.