పేద ప్రజలకు అండగా తెలంగాణ ప్రభుత్వం…

127
gopinath

పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో 12 వందల నిరుపేద కుటుంబాలకు గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బియ్యాన్ని అందించారు. లాక్ డౌన్ నేపథ్యంలో నియోజక వర్గంలో ప్రతి నిరుపేదకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తు న్నారు గోపినాథ్.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో నిరుపేదలకు బియ్యం పంపిణీ చేసిన గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం,రాష్ట్రం ప్రజలు ఇబ్బందులలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఇలాంటి ట్రస్ట్ లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

పేద ప్రజలు ఎవ్వరు కూడా ఇబ్బందులకు గురికావద్దన్నారు. కరోన వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఇండ్లలో ఉండి ప్రభుత్వం కు సహకరించాలన్నారు.

గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజక వర్గంలోని యూసఫ్ గూడ, రహమత్ నగర్ ,ఎర్ర గడ్డ,బోరాబండా, శ్రీనగర్ కాలనీ,షేక్ పేట ప్రాంతాల ప్రజలకు బియ్యం పంపిణీ కి ముందుకు వచ్చిన దాతలు శ్రీనివాస్ రెడ్డి,విజయ్ గాంధీ లింగం,భారత్ లింగం,మరవ్ లింగం,లోకేష్ లింగంలను అభినందించారు.