రూ.1.25 కోట్ల విరాళాన్ని ప్రకటించిన బాలయ్య…

114
nandamuri balakrishna

కరోనాపై పోరుకు తనవంతు సాయాన్ని ప్రకటించారు సినీ హీరో,ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. రూ. 1.25 కోట్లు విరాళంగా అందజేయన్నట్లు తెలిపారు. తెలంగాణ,ఏపీ ప్రభుత్వాల సీఎంల సహాయనిధికి చెరో 50 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

దీంతో పాటు సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సీసీసీ(కరోనా క్రైసిస్ ఛారిటీ)కి రూ. 25 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు.ఈ మేరకు సీసీసీకి సంబంధించిన చెక్‌ను నిర్మాత సి కల్యాణ్‌కు అందజేశారు. ప్రజలు ఇళ్లకే పరిమితమై తగిన జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు బాలయ్య.

సీసీసీకి విరాళం అందజేసిన బాలయ్యకు కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ప్రతి కష్ట సమయంలో ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే మీరెప్పుడు తోడుంటారని బాలయ్యని కొనియాడారు చిరు.