- Advertisement -
దివంగత ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు జరుపనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసందర్బంగా పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి కమిటిని ఏర్పాటు చేశారు. రాజ్యసభ ఎంపీ కేకే ఆధ్వర్యంలోని కమిటీని ఏర్పాటు చేశారు.
ప్రగతి భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు కే తారకరామారావు, ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్ మరియు పివి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శతజయంతి ఉత్సవాల నిర్వహణకు తీసుకోవాల్సిన కార్యక్రమాల పైన ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు ఎంపీ కేకే.వచ్చే సంవత్సరం జరుగనున్న పివి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
- Advertisement -