తెలంగాణ బడ్జెట్‌..దేశానికే దిక్సూచి

196
TS Budget for Formers
- Advertisement -

ఐదోసారి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ దేశానికే దిక్సూచిగా నిలవనుందని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఇది ఎన్నికల బడ్జెట్ కాదని ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే బడ్జెట్ అన్నారు. అణగారిన వర్గాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా బడ్జెట్ ఉండబోతుందన్నారు.

అభివృద్ధి,సంక్షేమమే ప్రధాన ఎజెండాగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసేలా బడ్జెట్ ఉండబోతుందని చెప్పారు. సంక్షేమం కోసం రూ. 33వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతానికి పైగా వృద్ధికి అనుగుణంగా బడ్జెట్ ఉండనున్నట్లు సమాచారం. వ్యవసాయంతో పాటు నీటిపారుదల, విద్య,ఆరోగ్య రంగాలకు పెద్దపీట వేశామన్నారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తలకు హైదరాబాద్ స్వర్గధామంగా మారిందన్నారు. రైతులకు రూ. 5 లక్షల బీమా కోసం కేటాయింపులు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలకు ఇచ్చే డబ్బు పెంచే అవకాశం ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులను రైతులకు అంకితం చేసేవిధంగా బడ్జెట్ ఉండబోతుందని ఈటెల తెలిపారు.

- Advertisement -