గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ఒక మహిళ ఫొటో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. గూగుల్ పేజ్ లో ‘జయలలిత డాటర్’ అని టైప్ చేయగానే మధ్యవయస్సురాలి ఫొటో ఒకటి స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది. తనే జయలలిత కూతరు అని అందరూ ఫిక్స్ అయ్యేలా ఉంటుంది ఆ ఫొటో. ఇంకొందరు మరో అడుగు ముందుకు వేసి.. ఆమె ఒకనాటి టాలీవుడ్ అందాల హీరో, జయలలితల ముద్దుల తనయ అనేంత వరకు ఇష్యూని తీసుకెళ్లారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇదే రచ్చ సాగింది. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ ఓ న్యూస్ తీసుకొచ్చారు సింగర్ చిన్మయి.
ఆమెపేరు దివ్యా రామనాథన్ వీరరాఘవన్. జయలలిత కూతురు కానే కాదు. ఆమె ఆస్ట్రేలియాలో తన భర్తతో కలిసి నివసిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలకు, ఆమెకు ఏమాత్రం సంబంధం లేదు. వాళ్లు తన కుటుంబానికి చాలా బాగా తెలిసిన వాళ్లని, మంచి శాస్త్రీయ సంగీత కుటుంబం నుంచి వచ్చారని చిన్మయి తెలిపింది. ప్రముఖ మృదంగ విద్వాన్ వి.బాలాజీ కుటుంబానికి చెందినవారని వివరించింది. ఆయన కచేరీలు అంతగా బిజీగా లేనప్పుడు ప్రముఖ వెబ్ సిరీస్ ‘హజ్‌బ్యాన్‌డ్’లో నటిస్తారని కూడా తెలిపింది.
వాస్తవానికి ఇదే ఫొటో 2014 నుంచే ఇలా తిరుగుతోంది. అప్పట్లో జయలలిత జైలుకు వెళ్లినప్పుడు తొలిసారి ఈ ఫొటో బయటకు వచ్చింది. కాస్త సెన్సిబుల్‌గా ఆలోచించేవాళ్లకు ఇలాంటి ఫొటోలు చూస్తే ఎక్కడలేని చికాకు వస్తుంది. కానీ కొంతమంది మాత్రం వీటిని నిజంగానే నమ్మేస్తారు కూడా.