గ్రేటర్ విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అవిశ్వాస పరీక్ష కోసం ఈ నెల 19న జీవీఎంసీ పాలకమండలి సమావేశం కానుంది. అవిశ్వాస తీర్మానంపై ఇప్పటికే కార్పొరేటర్లకు కలెక్టర్ ఆఫీస్ సమాచారం అందించారు.
అవిశ్వాసం ఎదుర్కొనున్న తొలి మేయర్గా హరివెంకట కుమారి నిలవనున్నారు. బల పరీక్షలో టీడీపీ నెగ్గాలంటే 75 మంది బలం అవసరం కాగా 34 మంది కార్పొరేటర్లను ఇప్పటికే బెంగళూరు తరలించింది వైసీపీ. టీడీపీ క్యాంప్ రాజకీయాలకు జనసేన దూరంగా ఉంది.
2021లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 98 కార్పోరేటర్లకు గానూ వైసీపీ 59 స్థానాలను కైవసం చేసుకుంది. వైసీపీ తరఫున గొలగాని హరి వెంకట కుమారి మేయర్‌గా ఎన్నికయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికి ఆరుగురు వైసీపీ కార్పోరేటర్లు టీడీపీ-జనసేనలో చేరగా మరో ఆరుగురు పార్టీ మారితే మేయర్ పీఠం వైసీపీ చేజారడం ఖాయం.
Also Read:హైడ్రాలో మూటల వేట..హెచ్‌సీయూలో కాసుల వేట: కేటీఆర్