ఇటీవల టిప్పుసుల్తాన్ జయంతి సందర్భంగా తన మొబైల్ లో అశ్లీల చిత్రాలు చూస్తూ కర్ణాటక మంత్రి తన్వీర్ ఓ ఛానల్ కెమెరాకు చిక్కిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక ప్రభుత్వానికి ఈ విషయం కొంత తలనొప్పిగా కూడా మారింది. మంత్రి మాట్లాడుతూ తాను అశ్లీల చిత్రాలు చూడలేదని… నెట్‌లో వాటికవే ప్రత్యక్షమయ్యాయని వివరణ ఇచ్చాడు. తాజాగా ఆ మంత్రి తాను అశ్లీల చిత్రాలు చూస్తున్న వీడియోను రికార్డు చేసిన కెమెరామెన్ పైనా, రిపోర్టర్ పైనా కేసు పెట్టాడు.
తాజాగా ఆయన చూసిన ఫొటోలు ఎవరివన్న సంగతి తెలిసింది. ఆ ఫొటోలు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియావట. తన్వీర్ సేఠ్ చూసిన ఫొటోలు మెలానియావని ప్రముఖ జాతీయ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. మెలానియా మోడల్ గా ఉన్నప్పటి ఫొటోలను చూస్తూ, తన్వీర్ ఎంజాయ్ చేశారు. ఇది కాస్తా మీడియా కెమెరా కంట పడటంతో, ఆయనపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తూ ఇలాంటి పనులకు పాల్పడిన తన్వీర్ సేఠ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కాగా, ట్రంప్ విజయం సాధించడంతో మెలానియా పాత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విరివిరిగా పోస్ట్ అవుతున్నాయి. గతంలొ అసెంబ్లీ సమావేశాల్లో కొందరు మంత్రులు, శాసన సభ్యులు ఇలాగే నీలి చిత్రాలు చూస్తూ మీడియాకు అడ్డంగా బుక్ అయ్యిన విషయం తెలిసిందే.


