మా ఆయన బంగారం…

184
- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న రిపబ్లికన్ పార్టీ తరపు అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నారు. ఓ వైపు ఆయన మాటలు వివాదాస్పదం కాగా…తాజాగా తమ పట్ల ట్రంప్ అసభ్యంగా ప్రవర్తించారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తాజాగా ఐదుగురు మహిళలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రతిష్ట మరింత దిగజారిపోయింది.

అయితే తాను ఏ తప్పూ చేయలేదని ఆయన పదే పదే చెబుతున్నా… ప్రత్యర్థి పార్టీ, మీడియా ఆయనను వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ట్రంప్ కు ఆయన భార్య మెలానియా నుంచి మద్దతు లభించింది. సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెలానియా మాట్లాడుతూ, “మా ఆయన బంగారం” అని చెప్పారు. తన భర్తపై తనకు పూర్తి నమ్మకం ఉందని… ఈ వ్యతిరేక ప్రచారమంతా ప్రతిపక్షమే చేస్తోందని ఆమె ఆరోపించారు.తన భర్త అలాంటి మాటలు మాట్లాడారంటే తాను నమ్మలేకపోతున్నానని అన్నారు. తామిద్దరం ఏకాంతంగా ఉన్న సమయంలో కూడా ఆయన అనుచితంగా మాట్లాడిన సందర్భాలు లేవని ఆమె స్పష్టం చేశారు.

trump wife

ఇదిఇలా ఉండగా 2005లో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసి ట్రంప్ అడ్డంగా దొరికిపోయారు. ఇక మరోవైపు 74 ఏళ్ల జెస్సికా లీడ్స్ అనే మహిళా వ్యాపారి 30 ఏళ్ల క్రితం ఓ పేపర్ కంపెనీలో పనిచేస్తుండగా ట్రంప్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించారు. ”30 ఏళ్ల క్రితం ఓ విమానంలో నేను ట్రంప్ పక్క పక్కనే కూర్చున్నాం. విమానం కదిలిన 45 నిమిషాల తర్వాత అతడు నన్ను తాకరాని చోట్ల తాకడాని అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది.

అతడో అక్టోపస్ (ఎనిమిది కాళ్ల జంతువు). అతని చేతులు అన్నిచోట్లా ఉన్నాయి అంటూ తాను 38 ఏళ్ల వయసులో ఉండగా ఈ సంఘటన జరిగినట్లు లీడ్స్ చెప్పారు. ఆ సంఘటన తర్వాత తాను సీటు మార్చుకున్నాని ఆమె చెప్పారు. మరోపక్క 2005లో ట్రంప్‌‌కు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీలో రిసెప్షనిస్టుగా పనిచేసిన రేచల్ క్రూక్స్‌ను లైంగికంగా వేధించినట్లు ఆమె ఆరోపించారు. లిప్టులో వెళ్తుండగా తన ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకున్నాడని చెప్పిన సంగతి తెలిసిందే.

- Advertisement -