టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరిక!

0
Donald Trump
- Advertisement -

అమెరికా టెక్నాలజీ కంపెనీలు విదేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్లు, సంబంధిత మౌలిక సదుపాయాలను నిర్మించడాన్ని తమ ప్రభుత్వం అనుమతించబోదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ విదేశాల్లో డేటా సెంటర్లు నిర్మిస్తే ఆయా కంపెనీలపై భారీగా పన్నులు విధిస్తామని హెచ్చరించారు. ఈ పెట్టుబడుల వల్ల చైనాకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

చైనాలో తన కీలక పర్యటన ముగించుకుని వైట్‌హౌస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతర దేశాల్లో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి అమెరికా కంపెనీలను మేం అనుమతించబోం. ఎందుకంటే చైనా వాటన్నింటినీ తీసుకుంటుంది. అలా జరగడానికి మేం అంగీకరించబోం అని ట్రంప్ పేర్కొన్నారు.

డేటా సెంటర్ల నిర్మాణ పెట్టుబడులు అమెరికాలోనే ఉండాలని ఆయన ఆకాంక్షించారు. స్థానికంగా డేటా సెంటర్లు నిర్మించే కంపెనీల నుంచి ఆయా ప్రాంతాల ప్రజలు ప్రయోజనాలు పొందాలని సూచించారు. డేటా సెంటర్ల నిర్మాణాన్ని వ్యతిరేకించకుండా వాటి ద్వారా తమ కమ్యూనిటీలకు ప్రయోజనం చేకూరేలా చూసుకోవాలని అన్నారు.

ఏఐ మౌలిక సదుపాయాలు, సాంకేతిక రంగంలో చైనాపై అమెరికా ఆధిపత్యాన్ని కొనసాగించడమే తమ లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ రంగంలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా చైనా రెండో స్థానంలో ఉందని, మిగతా దేశాలు ఈ రెండు దేశాలకు చాలా దూరంలో ఉన్నాయని వ్యాఖ్యానించారు.

Also Read:దేశంలో పెరిగిన మత్య్స సంపద

అమెరికా టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో ఏఐ డేటా సెంటర్లు నిర్మిస్తే వాటిపై భారీ పన్నులు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. డేటా సెంటర్లను మీ ప్రాంతాలకు తీసుకురండి. వాటి ద్వారా మీకు, మీ కమ్యూనిటీలకు కంపెనీలు చెల్లించేలా చూసుకోండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వాటిని అడ్డుకోవద్దు. అమెరికాలో కాకుండా ఇతర దేశాల్లో నిర్మించడానికి మా కంపెనీలను అనుమతించబోం అని పేర్కొన్నారు.

- Advertisement -