పాకిస్థానీ నటి, టీవీ హోస్ట్ వీణా మాలిక్ లైవ్ టీవీ కార్యక్రమంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. తన శరీరాకృతి, అందం గురించి కొంతకాలంగా సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, ట్రోలింగ్‌పై ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో కెమెరాల ముందే మేకప్ తొలగించి ట్రోలర్లకు గట్టిగా సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీణా మాలిక్ 24 న్యూస్ హెచ్డీలో ప్రసారమయ్యే ‘వీణా హై నా’ అనే మార్నింగ్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలోనే తనపై వస్తున్న వ్యక్తిగత విమర్శల గురించి ఆమె స్పందించారు. ముఖ్యంగా తన బరువు, ఎత్తు, రంగు, అందం గురించి నెటిజన్లు చేస్తున్న వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఒక్కసారిగా తన కుర్చీలో నుంచి లేచిన వీణా మాలిక్ హైహీల్స్‌ను తొలగించి కెమెరాకు చూపించారు. ఇప్పటివరకు మీరు నా బరువును మాత్రమే చూశారు. ఇప్పుడు నా హీల్స్ తీసేస్తాను.. అప్పుడు నా ఎత్తు కూడా చూడొచ్చు అంటూ ట్రోలర్లకు చురకలు అంటించారు. అనంతరం చెప్పులు లేకుండానే కెమెరా ముందు నిలబడ్డారు.
అంతటితో ఆగకుండా తిరిగి కుర్చీలో కూర్చున్న వీణా మాలిక్ మేకప్ రిమూవర్ వైప్స్ తీసుకుని కెమెరాల ముందే తన మేకప్ తొలగించడం ప్రారంభించారు. ఫాల్స్ ఐల్యాషెస్తో పాటు ముఖానికి వేసుకున్న ఇతర మేకప్‌ను కూడా తుడిచేశారు. ఎలాంటి అలంకరణ లేకుండా తన సహజమైన ముఖాన్ని చూపిస్తూ విమర్శకులకు సవాల్ విసిరారు. ఈ సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసింది. మొత్తానికి తన రూపురేఖలపై వస్తున్న విమర్శలకు లైవ్ టీవీలోనే ఇలా సమాధానం చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ALso Read:దేశంలో పెరిగిన మత్య్స సంపద

