నషా ముక్త్ భారత్ యాత్రకు వెంకీ మద్దతు

2
Venkatesh
- Advertisement -

మాదకద్రవ్యాల రహిత భారతదేశం నిర్మాణమే లక్ష్యంగా చేపడుతున్న ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు వెంకటేష్ తన మద్దతు ప్రకటించారు. నవంబర్ 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో ఈ యాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నేత జి. కిషన్ రెడ్డి హీరో వెంకటేష్‌ను కలిసి యాత్రలో పాల్గొనాలని ఆహ్వానించారు.

దేశంలో యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటంతో పాటు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా యువతలో చైతన్యం తీసుకురావడం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా ప్రోత్సహించడం వంటి అంశాలపై కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

కిషన్ రెడ్డి ఆహ్వానంపై స్పందించిన వెంకటేష్ ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం చేపడుతున్న ఈ కార్యక్రమం మంచి ప్రయత్నమని అభిప్రాయపడ్డారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.

Also Read:దేశంలో పెరిగిన మత్య్స సంపద

- Advertisement -