- Advertisement -
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకుంటూ ముందు సాగుతున్నారు ట్రంప్ – బైడెన్. ఇక ప్రచారంలో భాగంగా పలుమార్లు ప్రచారంలో నోరు జారీ విమర్శల పాలైన ట్రంప్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ కుమారుడు బారన్‌కు కరోనా సోకిందని తిరిగి 15 నిమిషాల తరువాత మరలా వైద్యులను అడగ్గా, కరోనా పోయినట్టు వైద్యులు చెప్పారని వెల్లడించారు. పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి బలంగా ఉంటుందని, భయపడాల్సిన అవసరంలేదని, అన్నారు.
కరోనా వైరస్ ను అడ్డం పెట్టుకొని స్కూల్స్ మూసేయడం తగదని, పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇబ్బందులు ఉండవని ట్రంప్ తెలిపారు. అమెరికాలో 7,92,000 మంది పిల్లలు కరోనా బారిన పడ్డారని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ పేర్కొనగా ట్రంప్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.
- Advertisement -