చైనాపై మరోసారి ట్రంప్ విమర్శలు!

200
trump

చైనా వైఖరిపై మరోసారి విమర్శలు గుప్పించారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌. తాను మళ్లీ అధికారంలోకి వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ చైనాపై అమెరికా ఆధారపడకుండా చేస్తానని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ బీజింగ్‌ నుంచే వ్యాప్తి చెందిందనే విషయాన్ని ఎలా మర్చిపోగలమన్నారు ట్రంప్.

ఇప్పటికే పలు దఫాలుగా తన ప్రచారంలో చైనాను టార్గెట్‌ చేస్తూ వస్తున్న ట్రంప్‌…ప్రపంచమంతా కరోనా వ్యాపించడానికి ఆదేశమే కారణమని అందుకు భారీమూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇక ఇటీవల తనకు కరోనా సోకడంతో చైనా తీరుపై మరింత గుర్రుగా ఉన్నారు ట్రంప్‌.

ఇక టిబెట్‌ సమస్యలపై ఉన్నతాధికారిని నియమించింది అమెరికా. దీనిపై చైనా తీవ్రస్ధాయిలో మండిపడింది. తమ భూభాగంపై అమెరికా పెత్తనాన్ని సహించమని తేల్చి చెప్పింది.