హైదరాబాద్‌పై దుష్ప్రచారం చేయడం తగదు: తలసాని

111
talasani

హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ తో కలిసి పర్యటించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.గాంధీనగర్ డివిజన్ పరిధిలోని అరుంధతి నగర్,అడిక్ మెట్ డివిజన్ పరిధిలోని నాగమయ్య కుంట, పద్మానగర్, ప్రాంతాలలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని..ప్రకృతి వైపరీత్యాల వల్ల హైదరాబాద్ నగరానికి పెద్ద విపత్తు వచ్చింది..ఈ సంవత్సరం భారీ వర్షపాతం నమోదైందన్నారు.హైదరాబాద్ లో కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి..కొన్ని నాలాల నుండి నీళ్ళు వచ్చాయి..ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సహాయక చర్యలకు ఆదేశించారని వెల్లడించారు.

ప్రజాప్రతినిధులము పలు ప్రాంతాల్లో తిరుగుతూ సమస్యల్ని తెలుసుకొని పరిష్కరిస్తున్నాం..ఈ సంఘటన మనకు ఓ గుణపాఠం భవిష్యత్ తరాలకు ఈ సమస్యలు ఉండకూడదన్న దిశగా ఈ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.సోషల్ మీడియాలో ,టివి ఛానల్లో లో గాని హైదరాబాద్ పై దుష్ప్రచారం ఎక్కువ చేయడం చాలా బాధాకరం..కొన్ని ప్రాంతాలు చెరువులు కబ్జాలు చేసి కట్టారు,నాళాల పక్కన కట్టిన ప్రాంతల్లో ఇబ్బంది వచ్చిందన్నారు.

ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటాం..దీనికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటాము.హైదరాబాద్ నగర వాసులకు ఈ ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందన్నారు.ఇలాంటి ఎన్ని విపత్తులు వచ్చిన హైదరాబాద్ తట్టుకొని నిలబడింది..వీలైనంత తక్కువ సమయంలో అందరం కలిసి అన్ని శాఖల సమన్వయం తో ఈ సమస్యలను పరిష్కారిస్తాం అన్నారు.