దటీజ్ ట్రంప్..అనుకున్నది చేసేశారు..!

202
trump
- Advertisement -

అమెరికాలో విదేశీ వలసలకు అడ్డుకట్ట వేస్తూ దీనికి సంబంధించిన ఇమ్మిగ్రేషన్‌ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. దీంతో అమెరికాలోకి ప్రవేశించే విదేశీ వలసలకు అడ్డుకట్ట పడింది. ప్రస్తుతానికి 60 రోజులపాటు గ్రీన్ కార్డుల జారీని నిలిపివేస్తున్నామని… ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

కరోనా నేపథ్యంలో 2.20 కోట్ల మంది అమెరికన్లు ఉద్యోగాలు కొల్పోయారు. స్ధానిక అమెరికన్లకు మేలు చేసేందుకుకే ఈ నిర్ణయం తీసుకన్నానని ట్రంప్ వెల్లడించారు. తాము తీసుకున్న చర్య అమెరికన్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని…ఆర్ధిక పతనం నుండి అమెరికా కార్మికులను కాపాడుతుందని చెప్పారు.

ట్రంప్ తీసుకున్న చర్యతో హెచ్‌1బీ వీసాదారులకు ఇబ్బంది కలుగుతుందని టీడీఎఫ్ మాజీఅధ్యక్షుడు విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ప్రవాస తెలంగాణీయులకు నిరుద్యోగ సమస్య లేకపోయినప్పటికీ తర్వాత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.

https://twitter.com/realDonaldTrump/status/1252915116363874305

- Advertisement -