వీసా రూల్స్…వెనక్కితగ్గిన ట్రంప్

160
trump
- Advertisement -

వీసా రూల్స్‌పై వెనక్కి తగ్గారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఆన్‌లైన్ ద్వారా క్లాసుల‌కు హాజ‌రవుతున్న విదేశీ విద్యార్థుల వీసాల‌ను ర‌ద్దు చేయాల‌ని నిర్ణయించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తన నిర్ణయంపై మనసు మార్చుకుంటూ ..వివాదాస్పద వీసా విధానాన్ని ర‌ద్దు చేసింది.

క‌రోనా వైర‌స్‌తో చాలా వ‌ర‌కు విద్యాసంస్థ‌లు ఆన్‌లైన్ పాఠాల‌కు మొగ్గుచూపాయి. ఈ నేప‌థ్యంలో ఆన్‌లైన్ పాఠాలు వింటున్న విదేశీ విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల‌ని ఆదేశించింది. దీంతో పలు యూనివర్సిటీలు కోర్టులు పిల్ దాఖలు చేశాయి. ప్రభుత్వం నిర్ణ‌యం వ‌ల్ల విద్యార్థులు వ్య‌క్తిగ‌తంగా, ఆర్థికంగా దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉన్న‌ద‌ని వ‌ర్సిటీలు త‌మ పిటిష‌న్‌లో ఆరోపించాయి. దీంతో వెనక్కితగ్గిన ట్రంప్ సర్కార్ భార‌తీయ విద్యార్థుల‌తో పాటు ఇతరదేశాలకు చెందిన విద్యార్థులకు ఊరటకలిగించే నిర్ణయాన్ని తీసుకుంది.

- Advertisement -