దిగిపోయే ముందు కూడా ట్రంప్ మార్క్‌!

82
trump

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన మార్క్‌ చూపించారు. అధ్యక్ష కుర్చి దిగిపోయే సమయం దగ్గర పడుతున్న తన వ్యవహారశైలీలో మార్పు రాలేదు. కరోనావైరస్ విజృంభణతో కష్టాల్లో పడిపోయినవారిని ఆదుకోవానికి తీసుకొచ్చిన కరోనా సహాయ బిల్లుపై సంతకం చేయడానికి ట్రంప్‌ నిరాకరించారు ట్రంప్.

దీంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కరోనా,లాక్‌ డౌన్‌తో లక్షలాదిగా ఉద్యోగాలు కొల్పోవడం,నిరుద్యోగల సంఖ్య పెరిగిపోవడంతో ఆ దేశ ప్రజలపై తీవ్ర భారం పడింది. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో 1.4 కోట్ల మంది నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కోల్పోనున్నారు.

కరోనా సహాయ నిధి, ప్యాకేజీ కోసం 2.3 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీ విడుదల చేయాలని నిర్ణయించినా ఆ బిల్లుపై సంతకం చేసేందుకు ట్రంప్ నిరాకరించడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.