మందుబాబులకు షాక్..

198
drunk and drive
- Advertisement -

మందుబాబులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ప్రారంభం కావడంతో మద్యం సేవించి వాహనాలు నడిపే వారు షాక్‌కు గురవుతున్నారు. డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ ఏర్పాటు చేసిన ప్రాంతాల నుంచి తప్పించుకొని ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు.

ఇటీవల సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ను ప్రారంభించగా ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ అనిల్‌కుమార్‌ శుక్రవారం నుంచి డ్రైవ్‌ను నగరంలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ఆదేశాల మేరకు వివిధ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో డ్రంకన్‌ డ్రైవ్‌ను చేపట్టారు. గోషామహల్‌, సుల్తాన్‌బజార్‌, అబిడ్స్‌, నాంపల్లి, టోలీచౌకి, ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో డ్రంకన్‌డ్రైవ్‌లు నిర్వహించారు.

వాహన దారులు మద్యం సేవించి రోడ్డుపైకి రావద్దని సూచిస్తున్నాం. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుబడితే వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు జైలుకు వెళ్లడం ఖాయం అని చెబుతున్నారు పోలీసులు.

- Advertisement -