శాంతి ఒప్పందంపై ట్రంప్ ప్రకటన

5
- Advertisement -

పశ్చిమ ఆసియాలో వివాదాన్ని ముగించడానికి అమెరికా మరియు ఇరాన్ ఒక శాంతి ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాయి. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి ఇరు పక్షాలు ఇంకా చర్చలు మరియు బేరసారాలు సాగిస్తూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుక్రవారం మాట్లాడుతూ హార్ముజ్ జలసంధిలో విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తున్నామని… ఇరాన్‌తో ఒప్పందంపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పారు.

అయితే కాల్పుల విరమణ ఒప్పందం కోసం చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, ఎలాంటి తుది అవగాహన కుదరలేదనిఅమెరికా ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది.యుద్ధాన్ని శాశ్వతంగా ముగించే ఒప్పందంపై చర్చలు జరుపుతున్నప్పటికీ…కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించేందుకు ఇరు దేశాలు ప్రాథమిక అవగాహన ఒప్పందానికి (MoU) వచ్చాయి.

ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించే ప్రతిపాదిత ఒప్పందంపై తాను త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని…ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోవడానికి వైట్ హౌస్‌లో సమావేశం కానున్నట్లు ట్రంప్ తెలిపారు. ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో.. ఇరాన్ హార్ముజ్ జలసంధిపై తన పట్టును వదులుకోవాలని మరియు అణు ఆయుధాలను తయారు చేసే తన సామర్థ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని పేర్కొన్నారు.

తాము ఎప్పటికీ అణు ఆయుధాన్ని లేదా బాంబును తయారు చేయబోమని ఇరాన్ అంగీకరించాలి…. హార్ముజ్ జలసంధిని ఎటువంటి రుసుములు లేకుండా, ఇరువైపులా పరిమితులు లేని నౌకాయాన రాకపోకల కోసం తక్షణమే తెరవాలి…నీటిలో అమర్చిన మైన్స్ (water mines) ఏవైనా ఉంటే వాటిని పూర్తిగా తొలగించాలి అని ట్రంప్ అన్నారు.

ట్రంప్ చేసిన ప్రకటనలను ఇరాన్ వెంటనే తోసిపుచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని…ఎలాంటి తుది అవగాహన కుదరలేదని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. అమెరికా చేపట్టిన చర్యలు మొదటి నుంచి చట్టవిరుద్ధం అని ఆ దేశ ప్రతినిధులు తెలిపారు.

Also Read:బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా..ఈ తప్పులు అస్సలు చేయకండి!

- Advertisement -