ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోతే, ఇరాన్‌లోని ఎనర్జీ కేంద్రాలు, డిసాలినేషన్ ప్లాంట్లు సహా కీలక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని అన్నారు.
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఖాలిబాఫ్తో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ తెలిపారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికాతో ఎలాంటి చర్చలు లేవని ఖండించింది. మరోవైపు ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లోకి దండయాత్ర చేసి, ఇరాన్ మద్దతుతో ఉన్న హిజ్బుల్లాపై దాడులు కొనసాగిస్తోంది. ఈ పోరు దీర్ఘకాలం కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయి.
లెబనాన్‌లో ఐక్యరాజ్యసమితి శాంతి దళాలకు చెందిన ముగ్గురు సైనికులు 24 గంటల్లోనే మరణించారు. ఈ ఘటనలకు బాధ్యత ఎవరిదో స్పష్టత లేదు.దుబాయ్ సమీపంలో కువైట్‌కు చెందిన ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఓ తెలియని ప్రాజెక్టైల్ ట్యాంకర్‌ను తాకడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ 24 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
అలాగే, ఎయిర్ డిఫెన్స్ ఇంటర్‌సెప్షన్ తర్వాత పడిన శకలాలతో దుబాయ్‌లోని ఓ నివాస ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగి నలుగురు గాయపడ్డారు. ఇజ్రాయెల్ సైన్యం, యూఎన్ శాంతి దళాల మరణాలపై విచారణ చేపట్టింది.
Also Read:కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగిపారేసిన కాగ్

