భారీ వర్షాలతో పూణే నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. వడగళ్ల వాన కురవడంతో అనేక ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. వాతావరణ శాఖ ప్రకారం, పుణే మరియు పశ్చిమ ఘాట్స్ ప్రాంతంలో మేఘాల ఏర్పాటుతో ఈ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రం నుంచి తేమ ప్రవాహం, తక్కువ ఎత్తులో వాతావరణ అస్థిరత పెరగడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.
ఇది ప్రీ-మాన్సూన్ సమయంలో సాధారణంగా కనిపించే పరిస్థితి అయినప్పటికీ, ఈసారి తీవ్రత ఎక్కువగా ఉంది.మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ట్రలోని దక్షిణ-మధ్య ప్రాంతాలు, మరాఠ్వాడాలో ఇంకా కొన్ని రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోలాపూర్, సతారా, సంగ్లీ, నాగ్‌పూర్ వంటి ప్రాంతాల్లో కూడా వడగళ్ల వానలు కురిసే అవకాశముంది.
Also Read:కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగిపారేసిన కాగ్
రైతులు పంటలను ముందుగానే కోయాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

