ట్రంప్ ఎఫెక్ట్..ఆగిపోయిన వివాహాలు!

7
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతీయులకు వరుస షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హెచ్‌-1బీ వీసాల దరఖాస్తు ఫీజును రూ.88 లక్షలకు పెంచడం సర్వత్రా ఆందోళనకు దారితీసింది.

ఈ నేపథ్యంలో టెక్‌ కంపెనీలు కీలక సమావేశం నిర్వహించి సెలవులపై ఇతర దేశాలకు వెళ్లిన హెచ్-1బీ వీసా హోల్డర్లు 24 గంటల్లో యూఎస్‌కు తిరిగి వచ్చేయాలని చెప్పాయి. అంతేగాదు తమ కంపెనీల్లో పనిచేస్తూ హెచ్-1బీ వీసాలు ఉన్నవారు రెండువారాల పాటు అమెరికాను వదిలి వెళ్లవద్దని సూచించాయి.

దీంతో చాలామంది అర్జెంట్‌గా అమెరికాకు బయలు దేరగా చాలా మంది పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి, కొందరివి రద్దయ్యాయి. ఇక కొంతమంది హెచ్-1బీ వీసాలు ఉన్నవారు భారత్‌కు రాలేకపోయారు. తాను వివాహం చేసుకోవడానికి లీవ్ పెట్టి భారత్‌ వెళ్లాల్సి ఉందని, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత్‌కు రాలేదని తెలిపారు. పెళ్లిని వాయిదా వేసుకున్నామని …చాలా మంది ఇటువంటి నిర్ణయాలే తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

Also Read:BB9:మనీష్‌ ఎలిమినేట్

- Advertisement -