బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుంది. రెండో ఎలిమినేషన్‌లో భాగంగా మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యారు. ఏడుగురు రెండో వారంలో నామినేషన్‌లో ఉండగా భరణి, హరీష్,సుమన్ శెట్టి, డీమాన్ పవన్, ప్రియ సేఫ్ అయ్యారు. చివరిగా డేంజర్ జోన్‌లో ఫ్లోరా సైని, మర్యాద మనీష్ మిగలగా వీరిద్దరిని యాక్టివిటీ ఏరియాకి పిలిచారు నాగార్జున.
మీ వెనకాల ఉన్న సీతాకోక చిలుకలు చెప్తాయి మీరు ఎలిమినేటెడా కాదా అని అంటూ కాసేపు టెన్షన్ పెట్టారు నాగ్. అయితే యాక్టివిటీ ఏరియాలో జరుగుతున్న ఈ సీన్ చూసి దాదాపు హౌస్‌మేట్స్ అందరూ ఫ్లోరా ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. నిజానికి ఫ్లోరా కూడా నువ్వేం కంగారు పడకు నేనే ఎలిమినేట్ కాబోతున్నా అంటూ మనీష్‌కి ధైర్యం చెప్పింది. కానీ కట్ చేస్తే ఫ్లోరా సేవ్ అయి మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు.
ఆ తర్వాత స్టేజ్ మీదకు వెళ్లిన మనీష్..ఎలిమినేట్ అవుతానని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని చెప్పుకొచ్చాడు. ఉన్నంత వరకూ గేమ్ నిజాయతీగా ఆడాను.. లాస్ట్ 3 డేస్‌గా కాస్త ఫ్రిక్షన్ ఉంది కానీ నేను పరిష్కరించుకొని ఒక వారియర్‌లా బయటికొచ్చాను అని చెప్పాడు.
వెళ్లేముందు నీ దృష్టిలోటాప్-3, బాటమ్- 3 ఎవరో చెప్పేసి వెళ్లమని నాగార్జున అడిగారు. బాటమ్-3లో దమ్ము శ్రీజ ,ఫ్లోరా సైని ,సుమన్ శెట్టి పేర్లు చెప్పాడు మనీష్. సుమన్ అన్నా ఫస్ట్ మీకు హ్యాట్సాఫ్.. మీరు ఏం ఆడుతున్నారన్నా అసలు నేను అయితే ఊహించలేదు.. అయినా నాకు బాటమ్‌లో మీరు ఎందుకున్నారంటే సుమన్ అన్న.. మీరు అలా తళుక్కుమని వస్తారు వెళ్లిపోతారు అని రీజన్ చెప్పాడు.
ఇక టాప్-3లో భరణి పేరు చెప్పాడు మనీష్. అలాగే ఇమ్మానుయేల్ పేరు చెప్పాడు. తర్వాత సంజన పేరు చెప్పాడు. వెళ్లే ముందు ఒక బిగ్ బాంబ్ వేసి వెళ్లాలి అని చెప్పగా ఫ్లోరా పేరు చెప్పడంతో ఆమె జైలుకు వెళ్లారు.
Also Read:అమల్లోకి జీఎస్టీ కొత్త ధరలు..ఈ వస్తువుల ధరల తగ్గింపు!

