ట్రంప్ వర్సెస్ బైడెన్….తొలి డిబేట్

210
trump

నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థిగా ట్రంప్‌, డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా బైడెన్ పోటీప‌డుతున్నారు.ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరి పోరు జరుగుతుండగా తొలి డిబేట్‌ జరగనుంది. అక్టోబర్‌ 15న రెండోది, 22న మూడోది జరగనున్నాయి. ఫాక్స్‌ న్యూస్‌ యాంకర్‌ క్రిస్‌ వాల్లేస్‌ ఆధ్వర్యంలో ఇవాల్టి డిబేట్‌ జరుగనుంది.

ఈ డిబేట్‌ కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాను ఓడిపోతే అధికార మార్పిడి చేయనంటూ హాట్‌ కామెంట్స్‌లో ఎన్నికలను ఆసక్తిగా మారుస్తున్నారు.

అయితే బైడెన్‌ నుండి ట్రంప్‌కు గట్టిపోటీ ఎదురవుతోంది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, శాంతిభద్రతలు, విదేశాంగ విధానం లాంటి అనేక అంశాలపై అభ్యర్థులిద్దరూ తమ అభిప్రాయాలను వెల్లడించాల్సి ఉంటుంది.