ప్రభాస్‌…ఛత్రపతికి 15 ఏళ్లు

232
prabhas

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఛత్రపతి. సరిగ్గా 15 ఏళ్ల క్రితం అంటే 2005లో సినిమా విడుదలైంది.ప్రభాస్ సరసన శ్రీయ హీరోయిన్‌గా నటించగా అప్పట్లోనే 30 కోట్లు వసూలు చేసి ఆల్‌టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

ప్ర‌భాస్ న‌ట‌న‌, శ్రియ అందాలు, రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారాయి. ప్రభాస్ డైలాగ్‌లు సినిమాకు మరింత ప్లస్ కాగా డైలాగ్‌లు ఇప్పటికి అభిమానులకు గుర్తిండిపోయాయి.

నేటితో ఈ చిత్రం 15 సంవ‌త్సరాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ప్ర‌భాస్ అభిమానులు 15YearsForChatrapathi అనే హ్యాష్ ట్యాగ్‌తో సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. సూరీడు, దాదాగిరికి వచ్చినా దౌర్జన్యానికొచ్చినా గూండాయిజానికొచ్చినా గ్రూపులు కట్టడానికొచ్చినా పూటకో శవం లెక్కన పోర్టుకు బలువుతారు తీరం ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతుంది అనే డైలాగ్‌లను గుర్తుచేస్తున్నారు.