సమయం మించిపోతోంది:ట్రంప్

3
- Advertisement -

మధ్యప్రాచ్యంలో పరిస్థితులు అత్యంత వేగంగా మారుతున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ముదురుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్, లెబనాన్, గాజా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయాందోళనలు నెలకొన్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… ఇరాన్ ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితులు చేయి దాటిపోకముందే ఇరాన్ వెనక్కి తగ్గాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్ విషయంలో సమయం చాలా వేగంగా మించిపోతోంది… శాంతికి భంగం కలిగిస్తే అమెరికా చూస్తూ ఊరుకోదు. మా మిత్రదేశాల రక్షణకు మేము కట్టుబడి ఉన్నాము అని ట్రంప్ స్పష్టం చేశారు.

మధ్యప్రాచ్యంలో పూర్తి స్థాయి యుద్ధం రాకుండా నిరోధించేందుకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దౌత్యపరమైన చర్చలను ముమ్మరం చేశాయి. ఇరు దేశాల ప్రతినిధులు అమెరికా మరియు ఇరాన్ వైపు ఉన్న పక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. యుద్ధం వస్తే గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉండటంతో ఈ దేశాలు అప్రమత్తమయ్యాయి.

Also Read:చైనాలో పుతిన్ పర్యటన

అమెరికా హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ ఎవరికీ భయపడదని, తమ దేశ రక్షణ కోసం ఎలాంటి నిర్ణయానికైనా వెనకాడబోమని స్పష్టం చేశారు. మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ ఎవరైనా మాపై యుద్ధాన్ని రుద్దాలని చూస్తే మాత్రం తిప్పికొట్టడానికి మా దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదు అని అరాగ్చీ తేల్చి చెప్పారు.

- Advertisement -