కేరళ ప్రజల గొంతుకగా యూడీఎఫ్!

4
- Advertisement -

కేరళ నూతన ప్రభుత్వ పాలన ప్రజల గొంతుకకు అనుగుణంగా సాగుతుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. తిరువనంతపురంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవం అనంతరం కేరళ నూతన ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ మరియు ఆయన మంత్రిమండలికి రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) సాధించిన ఈ విజయం ప్రజల తీర్పుకు అద్దం పడుతోందని పేర్కొంటూ, కొత్త ప్రభుత్వంపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు. కేరళ ప్రజలు ఈ ప్రభుత్వం కోసం పోరాడారు. వారి గొంతుకే ఈ ప్రభుత్వానికి దిక్సూచి అవుతుంది. కేరళ ప్రజలందరి గొంతుకకు ప్రతిరూపంగా నిలవబోతున్న వి.డి. సతీశన్ గారికి మరియు పూర్తి మంత్రిమండలికి నా హృదయపూర్వక అభినందనలు అని వెల్లడించారు.

ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు కూడా రాహుల్ గాంధీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, మద్దతుదారులదన్నారు. అసలైన పని ఇప్పటి నుంచే మొదలవుతుంది అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Also Read:చైనాలో పుతిన్ పర్యటన

అంతకుముందు, తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో సతీశన్ నేతృత్వంలోని నూతన మంత్రిమండలిలోని 20 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మంత్రులతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.

- Advertisement -