టిఆర్ఎస్వి ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ 12 మంది కాంగ్రెస్ విలీన వివాదంపై తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. నిన్న కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌ను రాజకీయ ఉగ్రవాది అనడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాను. తక్షణమే బేషరతుగా సీఎం కేసీఆర్‌కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.
1971లో ఆనాడు తెలంగాణ ప్రజా సమితి 11 మంది ఎంపీలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్నందుకు ఇందిరాగాంధీని రాజకీయ ఉగ్రవాది అనే దమ్ముందా.? అలాగే 1980లో జనత పార్టీ హర్యానా స్టేట్‌లో సీఎంగా బజాన్ లాల్ 58 స్థానాలకు 38 స్థానాల్లో గెలిచిన పార్టీని కాంగ్రేస్ పార్టీలో విలీనం చేసుకుంటే తప్పు అనిపించలేదా.? అందుకు ఇందిరాగాంధీని రాజకీయ ఉగ్రవాది అనే దమ్ముందా?.. 2004లో ఎస్పీ ఎమ్మెల్యే డీకే అరుణను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకున్నందుకు సోనియాగాంధీని రాజకీయ ఉగ్రవాది అనే దమ్ముందా..? అని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.
ఒకరిని అనే ముందు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసి 11 మంది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు మీకు తెలంగాణ ప్రజల ఘోష వినబడలేదా..? 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారే తీర్మానించుకుని టిఆర్ఎస్ పార్టీ లోకి రావడం జరిగింది.రాజ్యాంగం పట్ల మీకు గౌరవం ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడొద్దు వెంటనే మీరు కేసులు విత్ డ్రా చేసుకోవాలి.
కాంగ్రెస్ LP విలీనంపై టిఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ తరుపున మీరు చేసిన తప్పులను తెలంగాణ ప్రజానీకం ప్రశ్నిస్తోందని, కాంగ్రెస్ పార్టీ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలని ఏఐసీసీకి లేఖ రాయండి. అని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.