మొక్కలు నాటిన టిఆర్ఎస్వి అదిలాబాద్ అధ్యక్షుడు..

52
Dharani Rajesh

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఉట్నూర్ మండల కేంద్రం తన ఇంటి ఆవరణలో టిఆర్ఎస్వి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఆక్సిజన్ అవసరం ఎంత ఉందో మనందరికీ తెలిసిన విషయమే అందుకోసం ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా మూడు మొక్కలు నాటడం జరిగింది అని తెలిపారు. మనందరిలో ఈ మొక్కల సంరక్షణ గురించి చైతన్యం తీసుకువస్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు అని తెలిపారు.