మన తక్షణ కర్తవ్యం మొక్కలు నాటి పెంచడమే..

66
Sumitranandan

రాజ్యసభ సభ్యులు జోగిన పల్లి సంతోష్ కుమార్ పిలుపునందుకొని తాను సైతం గ్రీన్ ఇండియా చాలేంజ్‌ను స్వీకరించి తన జనదినాన్ని పురస్కరించుకొని మూడు మొక్కలు (మామిడి , బత్తాయి, జామ )నాటినట్లు తెలంగాణ ప్రోగ్రెసీవ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు సుమిత్రానంద్ తెలియజేసారు. ప్రస్తుతం మానవాలి ముందున్న తక్షణ కర్తవ్యం మొక్కలు నాటి పెంచడమే.. ప్రాణవాయువును సజంగా అందించే చెట్ల అవసరాన్ని ప్రతి ఒక్కరు గుర్తించే సమయం వచ్చిందని సుమిత్రానంద్ తెలిపారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక బృహత్తర కార్యక్రమం అని ఈ బాధ్యతను భుజానికెత్తుకొని విశేష కృషి చేస్తూ అన్ని వర్గాలవారిని కదిలిస్తూ సామాన్యులనుండి సెలెబ్రెటీలవరకు మొక్కలు నాటే యజ్ఞంలో పాల్గొనేలా చేస్తున్న సంతోష్ కుమారు గారికి ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సుమిత్రానంద్ కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా ట్రస్మా అధ్యక్షులు తానోబ ఆనంద్ రావు వారి కుమార్తె మహతి పాల్గొన్నారు.